సినిమాలతో పాటు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV). తాజాగా వర్మ మాట్లాడిన మాటలకు... బిగ్‌బాస్ సీజన్3 కంటెస్టెంట్ అషురెడ్డి (Ashu Reddy) ఆయన చెంప పగలగొట్టారు. అయితే ఏం జరిగింది?.. ఎందుకు కొట్టింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ఇంటర్వ్యూ చూడాల్సిందే.
ఆ మధ్య 'బోల్డ్ ఇంటర్వ్యూ' (RGV interview) అంటూ అరియానాతో వర్మ చేసిన సందడి చూశాం. ఇప్పుడు అషురెడ్డితో అలాంటి ఇంటర్వ్యూనే చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు రామ్‌గోపాల్ వర్మ.
ఈ ఇంటర్వ్యూ ఎలా మొదలైందంటే..
ఓ కెఫేలో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకుని, మాట్లాడేందుకు ప్రయత్నించగా.. వర్మ ఎవరో తెలియనట్లు నటించింది అషురెడ్డి. ఇది కొద్దిగా ఓవర్ అయినట్లు అనిపించినప్పటికీ అదంతా వర్మ డైరెక్షన్లో చేసిన ఇంటర్వ్యూలో భాగమే.
మొత్తానికి మాటలు కలిపిన వర్మ అషు అందాలను పొగుడుతూ.. పరిచయం పెంచుకుంటారు. ఈ క్రమంలో వర్మ తన అందాలపై చేసిన కామెంట్లకు అషుకి కోపం వచ్చింది. వెంటనే ఆయన చెంప పగలగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? వర్మ ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఈ బోల్డ్ ఇంటర్వ్యూ కథేంటి? తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూలో చూడొచ్చు.
ఇదీ చూడండి:'ఆర్ఆర్ఆర్'తో పాటు ఆ సినిమాలు థియేటర్లలోనే..