ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వివాదాస్పద చిత్రాలు తీస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా 'మర్డర్' తీస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. మరోపక్క తన జీవిత కథతో 'రాము' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
కొత్త లుక్: 'దిశ' ఉదంతంపై దర్శకుడు ఆర్జీవీ సినిమా - ram gopal varma latest news
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' హత్య ఆధారంగా తీస్తున్న సినిమా పోస్టర్లను డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పంచుకున్నారు. నవంబరు 26న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
దేశ ప్రజల్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన 'దిశ' హత్యాచార ఘటన ఆధారంగా సినిమా తీస్తానని గతంలో వర్మ వెల్లడించారు. చివరికి శనివారం ఆ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. '2019 నవంబరు 26న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిపై నలుగురు వ్యక్తులు దారుణానికి పాల్పడి, హత్య చేసిన ఘటన ఆధారంగా తీస్తున్న సినిమా 'దిశ: ఎన్‌కౌంటర్'. సెప్టెంబరు 26న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. యువతి హత్య జరిగిన రోజున (నవంబరు 26న) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం చట్టాల్ని మార్చడమే కాదు.. బాధితురాలి పేరుతో 'దిశ' పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయం' అని వర్మ వరుస ట్వీట్లు చేశారు. అంతేకాదు తను తీస్తున్న సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను కూడా షేర్ చేశారు.