కుక్క పిల్ల.. సబ్బు బిళ్ల.. అగ్గిపుల్ల.. కాదేదీ కవితకు అనర్హం. రౌడీయిజం, ఫ్యాక్షనిజం, కరోనా వర్మ సినిమాకు కాదేదీ అనర్హం. విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్‌వర్మ. ఆయన ఎప్పుడు సినిమా మొదలు పెడతారో? ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ.. ఆ వ్యాధి నేపథ్యంగానూ 'కరోనా వైరస్' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు వర్మ. అంతేకాదు ఇది లాక్‌డౌన్ సమయంలో చిత్రీకరించారు. ఈరోజు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
"ఇదిగో కరోనా వైరస్ ఫిల్మ్ ట్రైలర్. లాక్‌డౌన్ సమయంలో కథ తయారు చేశాం. లాక్‌డౌన్ సమయంలోనే చిత్రీకరించాం. ఎందుకంటే మా పనిని దేవుడైనా, కరోనానైనా ఏదీ ఆపలేదు. కరోనా మనందరిలోనూ ఉన్న భయం. ఆ వ్యాధి, చావును జయించడానికి ప్రేమకున్న శక్తిని నిరూపించే పరీక్ష ఇది" అని ట్వీట్ చేశారు వర్మ.