తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మర్డర్'​ సినిమాపై అభ్యంతరం.. ఆర్జీవీపై కేసు - రామ్​ గోపాల్​ వర్మపై కేసు నమోదు

మిర్యాలగూడ ప్రణయ్​ హత్యోదంతం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ ప్రకటించారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రణయ్​ తండ్రి బాలస్వామి పిటిషన్​ దాఖలు చేశారు. విచారించిన కోర్టు సదరు దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులను ఆదేశించింది.

Ram Gopal Varma booked in 'Murder' movie row
'మర్డర్'​ సినిమా అభ్యంతరం.. ఆర్జీవీపై కేసు

By

Published : Jul 5, 2020, 8:34 AM IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత నట్టి కరుణపై మిర్యాలగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రణయ్‌ హత్యోదంతం నేపథ్యంగా 'మర్డర్‌' సినిమా చిత్రీకరణపై అభ్యంతరాలతో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కోర్టులో పిటిషన్​

సినిమా కోసం ప్రణయ్‌, అమృత, మారుతీరావు ఫొటోలు వాడారంటూ ప్రణయ్‌ తండ్రి బాలస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులను ఆదేశించింది. సినిమా చిత్రీకరణ నిలిపివేయాలన్న పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది.

ఫాదర్స్​డే రోజున ఫస్ట్​లుక్​

"ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలిపే అమృత‌, మారుతీరావు క‌థ‌తో తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రం హృద‌యాల్ని క‌దిలిస్తుంది. శాడ్ ఫాద‌ర్స్ ఫిల్మ్ పోస్ట‌ర్‌ను ఫాద‌ర్స్ డే రోజున విడుద‌ల చేస్తున్నా" అని వ‌ర్మ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇదే విషయమై అమృత స్పందించారంటూ ఓ పోస్ట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేయడం వల్ల.. "కొంద‌రిని చెడుగా చూపించ‌డానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవ‌డం సరికాదు. ఎందుకంటే.. ఏ వ్య‌క్తి చెడు కాదని నేను గ‌ట్టిగా న‌మ్ముతా. కేవ‌లం ప్ర‌తికూల‌ ప‌రిస్థితులు వ్య‌క్తిని చెడ్డ‌వాడిని చేస్తాయి. అలా ప్ర‌వ‌ర్తించేందుకు కార‌ణ‌మౌతాయి. దీన్నే నేను 'మ‌ర్డ‌ర్'లో చూపించాలి అనుకుంటు‌న్నా. ఆ ప్ర‌క‌ట‌న రాసిన వారికి నేను చివ‌రిగా ఒక‌టి చెబుతున్నా.. మ‌నుషుల‌పై, వారి ఫీలింగ్స్‌పై నాకు గౌరవం ఉంది. వారు ప‌డ్డ బాధ‌ను, నేర్చుకున్న పాఠాన్ని గౌర‌విస్తూ మ‌ర్డ‌ర్ తీయ‌బోతున్నా" అని వ‌ర్మ పేర్కొన్నారు.

ఇదీ చూడండి... హిట్​ కాంబినేషన్లు మళ్లీ రాబోతున్నాయి

ABOUT THE AUTHOR

...view details