సినిమాలతో పాటు, సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టే పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV). తాజాగా వర్మ మాట్లాడిన మాటలకు నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అషురెడ్డి (Ashu Reddy) ఆయన చెంప పగలగొట్టారు. అయితే, అదంతా నిజంగా కాదులెండి. ఇటీవల వర్మ ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
రామ్‌గోపాల్ వర్మ చెంప పగలగొట్టిన నటి! - అషూ రెడ్డితో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma). ఓ ఇంటర్వ్యూ కోసం' బిగ్‌బాస్' ఫేమ్ అషు రెడ్డి దగ్గరకు వెళ్లగా.. ఆమె వర్మ చెంప పగలకొట్టింది. అసలేమైందంటే?
ఆ మధ్య 'బోల్డ్ ఇంటర్వ్యూ' (RGV interview) అంటూ అరియానాతో వర్మ చేసిన సందడి చూశాం. ఇప్పుడు అషురెడ్డితో అలాంటి ఇంటర్వ్యూనే ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓ కెఫేలో కాఫీ తాగుతున్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారు. ఆయనే స్వయంగా పరిచయం చేసుకుని, మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అషురెడ్డి ఏమీ తెలియనట్లు నటించారు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపేందుకు ప్రయత్నించే క్రమంలో వర్మ అన్న మాటలకు కోపం వచ్చిన అషు.. ఆయన చెంప పగలగొట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? వర్మ ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఈ బోల్డ్ ఇంటర్వ్యూ కథేంటి? తెలియాలంటే సెప్టెంబరు 7వ తేదీ వరకూ ఆగాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి.
ఇదీ చూడండి:సుధీర్, ఆది- రష్మి, దీపికలా మారితే..!