RGV Tweets Again on Tickets Price in AP: ఏపీలో సినిమా టికెట్ ధరలు పెరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరపై మరోసారి రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
'టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అంగీకరించాలని దేవుడిని వేడుకుంటున్నా. ఫ్లాప్ సినిమాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నా. చిన్న సినిమాలు కూడా బాహుబలిని మించి హిట్ కావాలని ఆశిస్తున్నా' అంటూ ఆర్జీవీ ట్విట్ చేశారు.