యువ కథానాయకుడు రామ్ కొత్త చిత్రం దాదాపు ఖరారైనట్టే. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపేశారు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచే దానిని ప్రారంభించే అవకాశముంది.
రామ్ కొత్త సినిమా.. తమిళ ప్రముఖ దర్శకుడితో - Ram latest news
అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన లింగుస్వామి.. రామ్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.
దర్శకుడు లింగుస్వామితో రామ్ సినిమా
తమిళ దర్శకుడైన లింగుస్వామి 'పందెం కోడి', 'రన్', 'ఆవారా' తదితర అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నేరుగా తెలుగులో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు రామ్‌తో ఆ చిత్రం కుదిరింది. రామ్ కూడా తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకుల్నీ పలకరించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంతో ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలున్నాయి. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.