లాక్‌డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ జాబితాలోనే ఉంది రామ్ కథానాయకుడుగా కిశోర్ తిరుమల తెరకెక్కించిన 'రెడ్'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్ర బృందం. లాక్‌డౌన్ నేపథ్యంలో విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఓ ఆంగ్ల పత్రిక రామ్ సందిగ్థంలో ఉన్నాడని రాసుకొచ్చింది. "లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా థియేటర్లు తెరవాలంటే చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో చిత్ర నిర్మాత ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనీ.. అదే నిజమైతే 'రెడ్' థియేటర్లలో విడుదలకాదని పేర్కొంది. ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించాడు రామ్.
'నా సినిమాను బిగ్‌స్క్రీన్‌లోనే చూస్తారు'
రామ్ హీరోగా తెరకెక్కిన 'రెడ్' చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను కొట్టిపాడేశాడు రామ్. పరిస్థితులు సద్దుమణిగాక థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేశాడు.
'నా సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది'
"అలాంటిదేం లేదు! రామ్ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు 'రెడ్' సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు" అని తెలిపాడు. స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో రామ్ సరసన ముగ్గురు నాయికలు ఆడిపాడారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఇదీ చూడండి : 'కరోనా అంతమైన తర్వాత ఈ చిన్నారిలా గెంతుతా'