ప్రస్తుత జనరేషన్లో టాలీవుడ్ హీరోలతో మల్టీస్టారర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మెగాహీరో వరుణ్‌తేజ్, రామ్, నాగచైతన్యలతో నటించేశాడు. ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలో ఉందని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
మలయాళ ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చిన చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్'. ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ నటించాడు. ఈ సినిమా హక్కుల్ని చరణ్ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. తెలుగులో వెంకటేశ్ హీరోగా త్వరలో నిర్మించనున్నాడు. ఇందులోని ఓ కీలక పాత్రలోనూ చెర్రీ కనిపించనున్నాడని సమాచారం.