తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​చరణ్​కు ఆ 'డ్రైవింగ్‌ లైసెన్స్‌'తో సంబంధం లేదట! - driving licence news by ramcharan

టాలీవుడ్ మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ హీరోగానే కాకుండా నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్'​ షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ స్టార్​హీరో... తండ్రి కోసం మలయాళ చిత్రం 'లూసిఫర్​' రీమేక్​ హక్కులు కొన్నాడు. అయితే తాజాగా డ్రైవింగ్​ లైసెన్స్​ సినిమా హక్కులు కూడా కొన్నట్లు వార్తలు రాగా.. సినీ వార్గాల ప్రకారం వాటిలో నిజం లేదని తెలుస్తోంది.

Ram Charan will not buy the remake rights of Prithviraj sukumarna starer driving licence
రామ్‌చరణ్‌

By

Published : Feb 21, 2020, 5:56 AM IST

Updated : Mar 2, 2020, 12:51 AM IST

రామ్‌చరణ్‌ ఓవైపు కథానాయకుడిగా బిజీగా గడిపేస్తూనే.. తన తండ్రి కోసం నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి అతడి కోసం కథలు సిద్ధం చేయించడం.. ఆ కథలకు తగ్గ దర్శకుల్ని వెతికి పట్టుకురావడం అన్నీ చెర్రీనే చూసుకుంటున్నాడు. ప్రస్తుతం చరణ్​ నిర్మాణంలోనే కొరటాల శివ - మెగాస్టార్​ కొత్త చిత్రం ముస్తాబవుతోంది. ఇది పూర్తయిన వెంటనే తన తండ్రి కోసం చరణ్‌ ఇప్పటికే ఓ కథ కూడా వెతికి పెట్టేసుకున్నారు. అదే 'లూసిఫర్‌' రీమేక్‌. అయితే ఇటీవలే రామ్​చరణ్​ 'డ్రైవింగ్‌ లైసెన్స్‌' అనే మరో మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చాయి.

రామ్​చరణ్​

ఈ సినిమా తన బ్యానర్‌లోనే బయట హీరోతో నిర్మించనున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, తాజాగా చరణ్‌ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. అతడు 'డ్రైవింగ్‌ లైసెన్స్‌' హక్కులు కొనలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్‌ నటుడిగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో.. నిర్మాతగా చిరంజీవి 152వ సినిమాతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ రెండింటిపైనే చెర్రీ దృష్టంతా ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడా చిత్ర రీమేక్‌ హక్కులను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Last Updated : Mar 2, 2020, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details