తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' కంటే ముందే ఎన్టీఆర్, రామ్​చరణ్ కలిసి! - NTR TV show Evaru Meelo Koteeswarulu

'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్, రామ్​చరణ్​ను కలిసి చూడనున్నామనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. అంతకంటే ముందు వారిద్దరూ కలిసి సందడి చేయనున్నారట. ఇంతకీ ఎక్కడ?ఎప్పుడు?

.
.

By

Published : Jul 15, 2021, 6:05 PM IST

మెగా, నందమూరి అభిమానులకు ఫుల్​ జోష్ తెప్పించే వార్త ఇది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో థియేటర్లలో త్వరలో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్, తారక్.. ఇప్పుడు బుల్లితెరపైనా కలిసి అలరించేందుకు రెడీ అవుతున్నారు.

రామ్​చరణ్-ఎన్టీఆర్

'బిగ్​బాస్' రియాలిటీ షోతో గతంలో హోస్ట్​గా మెప్పించిన యంగ్​టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ వచ్చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్​కు మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ అతిథి రానున్నారు! దీంతో ఈ కథానాయకుల అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల టీజర్లు, 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్'(మేకింగ్ వీడియో) యూట్యూబ్​లో దుమ్ములేపుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ చేస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్-తారక్

ABOUT THE AUTHOR

...view details