మెగాస్టార్ చిరంజీవి, తన 152వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దీనికి 'ఆచార్య' టైటిల్ అనుకుంటున్నారని, హీరో రామ్‌చరణ్ ఇందులో నక్స్‌లైట్‌గా కనిపించనున్నాడని... ఇలా రోజుకో వార్త ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి తోడు మరో అదిరిపోయే వార్త బయటకొచ్చింది. అదేంటంటే ఇందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అతిథి పాత్రలో కనిపించనున్నాడని.
#చిరు152లో మహేశ్‌బాబు.. కారణం ఆ హీరోనే! - entertainment news
మెగాస్టార్ చిరు కొత్త సినిమాలో మహేశ్‌బాబు అతిథి పాత్ర పోషించనున్నాడట. ఈ విషయమై సూపర్‌స్టార్‌తో రామ్‌చరణ్ మాట్లాడాడని టాక్.
![#చిరు152లో మహేశ్‌బాబు.. కారణం ఆ హీరోనే! #చిరు152లో మహేశ్‌బాబు.. కారణం ఆ హీరోనే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6158804-878-6158804-1582303937724.jpg)
హీరో చరణ్.. ఈ విషయమై మహేశ్‌తో చర్చలు జరిపాడని, త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇటీవలే సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సూపర్‌స్టార్. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదలుకానున్న సినిమాలో నటించనున్నాడు.
#చిరు152లో త్రిష హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కొరటాల శివ దరక్శత్వం వహిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందీ చిత్రం.