మెగాహీరో రామ్‌చరణ్.. తమ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ ఎంతోమంది సహాయం చేస్తున్న వారిని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో శనివారం ట్విట్టర్ వేదికగా ఓ నోట్‌ను విడుదల చేశారు.
Ram charan: అభిమానులకు రామ్‌చరణ్ ధన్యవాదాలు - Ram Charan ACHARYA
కరోనా కష్టకాలంలోనూ ఎంతోమందికి సాయం చేస్తూ, అండగా నిలబడుతున్న మెగా అభిమానులకు హీరో రామ్‌చరణ్ ధన్యవాదాలు తెలిపారు. అంకిత భావంతో పనిచేస్తున్నారని వారిని మెచ్చుకున్నారు.
రామ్‌చరణ్
"అభిమానులు.. ప్రస్తుత పరిస్థితుల్లోనూ కష్టపడి చేస్తున్న ఈ సమాజసేవ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడి సాయం చేయడం నుంచి ఎన్నోసేవా కార్యక్రమాల్లో పాల్గొని అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఎందరికో సాయం చేసిన మీకు పేరు పేరున నా శుభాభానందనలు. ధన్యవాదాలు" అని రామ్‌చరణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల్లో నటిస్తున్నారు రామ్‌చరణ్. కొవిడ్ పరిస్థితులు చక్కబడగానే షూటింగ్లో పాల్గొంటారు.
Last Updated : Jun 5, 2021, 7:45 PM IST