మెగాహీరో రామ్‌చరణ్ కొత్త సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దర్శకుడు శంకర్‌కు ఊరట లభించింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి మార్గం సుగమమైంది. దీంతో వచ్చే నెల షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిర్మాత దిల్‌రాజు, శంకర్, హీరో రామ్‌చరణ్.. చెన్నైలో ఆదివారం సమావేశమయ్యారు. సినిమా గురించి వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ అప్డేట్ రానుందని హీరో రామ్ చరణ్ సహా నిర్మాణసంస్థ ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తుండగా, కియారా అడ్వాణీని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం.. రాజకీయ నేఫథ్య కథతో తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.