Ram Charan Shankar Movie: 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య'... ఈ రెండు సినిమాలూ ఒక దాని వెంట మరొకటి విడుదలవుతాయి. అయినా సరే, విశ్రమించేది లేదు అంటున్నారు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రాన్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే మరో దఫా ఆ సినిమాచిత్రీకరణలో పాల్గొననున్నారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తయినట్టుతెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో రామ్‌చరణ్‌పై పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. ఆ వెంటనే అమృత్‌సర్‌లోనూ చిత్రీకరణ చేయనున్నట్టు తెలుస్తోంది. రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఆయనకి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
సైఫ్ తప్పుకొన్న చిత్రంలో కరీనా