మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాల్ని రేకెత్తిస్తోంది. ఆ సినిమా ప్రకటన వచ్చినప్పట్నుంచి అటు తమిళ పరిశ్రమలోనూ, ఇటు తెలుగులోనూ తరచూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం. తాజాగా ప్రధాన కొరియోగ్రాఫర్‌ను ప్రకటించింది. పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చిన జానీ మాస్టర్‌ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశాడు జానీ.
రామ్‌చరణ్- శంకర్ మూవీకి కొరియోగ్రాఫర్ ఫిక్స్.. - liguswamy bharati raja
రామ్‌చరణ్-శంకర్ మూవీ కోసం ప్రధాన కొరియోగ్రాఫర్‌ను ఎంపిక చేసింది చిత్రబృందం. అలాగే లింగుస్వామి-రామ్ పోతినేని సినిమా సెట్లో సందడి చేశారు ప్రముఖ దర్శకనిర్మాత భారతీరాజా.
రామ్ చరణ్
తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కృతి శెట్టి హీరోయిన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్లో దర్శకుడు శంకర్ సందడి చేయగా.. తాజాగా మరో ప్రముఖ దర్శకనిర్మాత భారతీరాజా ఈ సెట్‌కు విచ్చేశారు. ఆయన పుట్టినరోజు వేడుకుల్ని ఈ సందర్భంగా జరుపుకొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.