తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్ఆర్' అభిమానుల కోసం చెర్రీ​ అప్​డేట్ - రామోజీ ఫిల్మ్​సిటీలో ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆర్​ఆర్ఆర్' చిత్రం నుంచి ఓ అప్​డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్​సిటీలో షూటింగ్ జరుపుకొంటున్నట్లు మెగా పవర్​స్టార్​ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

రామ్​చరణ్​

By

Published : Nov 12, 2019, 4:46 PM IST

Updated : Nov 12, 2019, 5:23 PM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతోంది. ఇద్దరు హీరోలతో సహా సినిమాలోని కీలక నటీనటులు ఇందులో పాల్గొననున్నారు. చిత్రీకరణకు వెళ్తూ తాజాగా ఓ వీడియో ద్వారా ఈ అప్​డేట్​ ఇచ్చాడు చెర్రీ.

"రామోజీ ఫిల్మ్​సిటీకి మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఉదయాన్నే వస్తే భలే ఉంటుంది. మార్నింగ్​ షూట్​ను చాలా ఎంజాయ్ చేస్తాను." అంటూ వీడియోను పంచుకున్నాడు మెగా పవర్ స్టార్.

రామ్​చరణ్

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్​, కొమురం భీమ్​ పాత్రలో తారక్​​ కనిపించనున్నారు. రామ్​ చరణ్​​ సరసన ఆలియా భట్ నటిస్తోంది.

ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవ్​గణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్​పై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం... వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా: పూజా

Last Updated : Nov 12, 2019, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details