తెలంగాణ

telangana

ETV Bharat / sitara

cinema news:'ఆర్ఆర్ఆర్' షూటింగ్​లో చరణ్.. ఆ రీమేక్​కు టైటిల్ - మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురములో హిందీ రీమేక్, నయనతార కొత్త చిత్రాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

Ram charan RRR, ala vaikunthapurramuloo hindi remake title, nayanthara new movie
రామ్ చరణ్ అల్లు అర్జున్

By

Published : Jun 21, 2021, 12:20 PM IST

*మెగాహీరో రామ్​చరణ్(Ram charan).. ఆర్ఆర్ఆర్(RRR) షూటింగ్​కు సోమవారం నుంచి తిరిగి హాజరయ్యారు. తెలంగాణలో లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో చిత్రీకరణలు పున ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'ఆర్ఆర్ఆర్' తుదిదశ షూటింగ్ మొదలైంది. ఇందులో చరణ్​ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

రామ్​చరణ్

*'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్​కు 'సేహ్​జాదా' అనే టైటిల్​ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తారు. ఇందులో మనీషా కొయిరాలా కీలకపాత్ర పోషించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్నారు.

కార్తిక్ ఆర్యన్, కృతి సనన్

*ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నయనతార.. మలయాళ స్టార్ నివీన్​ పాలీతో ఓ తమిళ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకు ముందు వీరిద్దరూ 'లవ్ యాక్షన్ డ్రామా' చిత్రంలో కలిసి నటించారు. అలానే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు నయన్ సంతకాలు చేసిందట.

నివీన్ పాలీ నయనతార

*తెలుగు-కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఓ సినిమాకు 'వద్దురా సోదరా' టైటిల్​ ఖరారు చేశారు. అలానే ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశారు. రిషి, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇస్లా ఉద్దీన్ దర్శకత్వం వహిస్తున్నారు.

వద్దురా సోదరా మూవీ ఫస్ట్​లుక్
లోల్ సలామ్ కొత్త పోస్టర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details