మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైరస్ కోలుకున్నట్లు సోమవారం జరిపిన కొవిడ్ పరీక్షల్లో తేలిందని చెర్రీ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
"వైరస్ నుంచి కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందనే వార్త మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీరు నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు".
- రామ్‌చరణ్, కథానాయకుడు