తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"నా పుట్టినరోజున అతిపెద్ద బహుమతి అదే"

కరోనా వ్యాప్తి వల్ల తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించొద్దని అభిమానులకు సూచించాడు హీరో రామ్​చరణ్. వైరస్​ను అరికట్టే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నాడు.

మీరు నాకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అదే: రామ్​చరణ్
రామ్​చరణ్

By

Published : Mar 18, 2020, 11:12 AM IST

Updated : Mar 18, 2020, 9:20 PM IST

కరోనా ప్రభావం వల్ల సినిమా షూటింగ్​లు ఇప్పటికే వాయిదా పడుతుండగా, కొందరు సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 27న అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశాడు హీరో రామ్​చరణ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ వైరస్​ను​ అరికట్టే విధానాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని ఫ్యాన్స్​కు సూచించాడు. తమ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చితే, ఈ సంవత్సరం తనకిచ్చే అతిపెద్ద బహుమతి అదేనని రాసుకొచ్చాడు.

రామ్​చరణ్ విడుదల చేసిన ప్రకటన

'ఆర్ఆర్ఆర్'లో హీరోగా నటిస్తున్న చరణ్.. సహనటుడు జూ.ఎన్టీఆర్​తో కలిసి ఓ వీడియో ద్వారా ప్రజలకు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాడు. కరోనాను అరికట్టేందుకు ఆరు సుత్రాలను అందులో ప్రస్తావించారు ఈ ఇద్దరు స్టార్​ హీరోలు. ఈ వైరస్​ ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

Last Updated : Mar 18, 2020, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details