తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్ - రామ్​చరణ్ మూవీస్

Rajamouli mahabharata: స్టార్ డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్​ప్రాజెక్టులో ఇద్దరూ హీరోలు కన్ఫర్మ్​ అయిపోయారు. వారే 'ఆర్ఆర్ఆర్'లో నటించిన చరణ్-ఎన్టీఆర్. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

rajamouli ram charan ntr
రామ్​చరణ్ రాజమౌళి ఎన్టీఆర్

By

Published : Dec 27, 2021, 3:56 PM IST

Ram charan Ntr: మెగా, నందమూరి ఫ్యాన్స్​కు అదిరిపోయే వార్త. రామ్​చరణ్-ఎన్టీఆర్ ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించగా.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులోనూ తెర పంచుకోనున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​లో భాగంగా ఈ విషయం స్పష్టమైంది. రాజమౌళి దీనిని ఖరారు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్

'మేమిద్దరం మీ డ్రీమ్​ప్రాజెక్ట్​ 'మహాభారతం'లో ఉంటామా?' అని చరణ్​ ప్రశ్నించగా.. 'హా కచ్చితంగా ఉంటారు' అని డైరెక్టర్ రాజమౌళి చెప్పారు. అయితే ఆ సినిమా తీయడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చని అన్నారు.

పీరియాడికల్ ఫిల్మ్​ 'ఆర్ఆర్ఆర్'.. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details