టాలీవుడ్‌లో సరికొత్త కాంబినేషన్ సెట్ అవబోతుందని సమాచారం. రామ్ చరణ్ హీరోగా 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్న చరణ్ తదుపరి సినిమాపై ఎప్పటి నుంచో రకరకాల వార్తలొస్తున్నాయి. ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు గౌతమ్ తెరపైకి వచ్చారు.
'జెర్సీ' దర్శకుడితో రామ్‌చరణ్! - గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్
'ఆర్ఆర్ఆర్' తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎవరితో సినిమా చేస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. లైనప్‌లో చాలామంది దర్శకులు ఉండగా గౌతమ్ తిన్ననూరి పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది.
చరణ్ కోసం గౌతమ్ పాన్ ఇండియా స్థాయిలో ఓ కథ రాసుకున్నారని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. చెర్రీ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే స్క్రిప్టుని సిద్ధం చేశారట. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని వినికిడి. మరి చెర్రీ ఏ దర్శకుడికి అవకాశం ఇస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
'మళ్లీరావా'తో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ రెండో సినిమా 'జెర్సీ'తో విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ కొవిడ్ బారినపడ్డారు. కోలుకున్నాక 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రీకరణలో పాల్గొంటారు.