మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఓ పక్క హీరోగా, మరోపక్క నిర్మాతగా రాణిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి 'రౌద్రం రణం రుధిరం'(ఆర్‌ఆర్‌ఆర్ ) చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నారట చరణ్. యువదర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. సినిమా దాదాపు ఖరారైందని సమాచారం.
'జెర్సీ' దర్శకుడితో రామ్‌చరణ్ చిత్రం! - రామ్ చరణ్ తాజా వార్తలు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఓ యువ దర్శకుడితో సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నారట చరణ్.
రామ్
అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ పూర్తికాగానే సినిమా షూటింగ్‌లు ప్రారంభమౌతాయి. 'ఆర్‌ఆర్‌ఆర్' ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి 'జెర్సీ' చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తవ్వగానే రామ్ - గౌతమ్‌ల చిత్రంపై పూర్తి వివరాలు రానున్నాయని చెప్పుకుంటున్నారు.
Last Updated : May 31, 2020, 7:11 AM IST