మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా.. తాజాగా షూటింగ్ ప్రారంభంపై స్పష్టతనిచ్చారు నిర్మాత దిల్‌రాజు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవలే ఈ సినిమా సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్- శంకర్ చిత్రం షూటింగ్‌పై క్లారిటీ.. - పూజా హెగ్డే వ్యాక్సినేషన్
రామ్ చరణ్-శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌పై స్పష్టతనిచ్చారు నిర్మాత దిల్‌రాజు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రో డాడీ'. మరో కథానాయకుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించడం సహా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొంది సీనియర్ నటి మీనా. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.
నటి పూజా హెగ్డే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో టీకా తీసుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. "నవ్వుతో భయాన్ని దాచుకునే సందర్భం ఇదే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.