రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రం తర్వాత చరణ్ సోలోగా రానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న రామ్ చరణ్.. ఆ తర్వాత చిరంజీవి చిత్రం 'ఆచార్య'లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు మూవీల తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'ఎవడు' దర్శకుడితో మరో సినిమాకు చెర్రీ ఓకే? - latest ram charan new movie updates
ప్రముఖ హీరో రామ్‌చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో మరో సినిమా రానుందని సమాచారం. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు చెర్రీ.
'ఎవడు' దర్శకుడితో మరోసారి చెర్రీ సినిమా?
ఇటీవలే వంశీ చెప్పిన కథని రామ్‌చరణ్ విని ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఇద్దరి మధ్యా కథా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వీరిద్దరి కలయికలో మరో సినిమా ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్'