బాలీవుడ్ సినిమాకు తెలుగు తారలు గొంతు అరువివ్వడం కొత్తేం కాదు. తాజాగా రామ్ చరణ్ మరోసారి సల్మాన్ ఖాన్ కోసం తన డబ్బింగ్ చెప్పబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం సల్మాన్.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో 'భారత్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కండల వీరుడి కోసం చరణ్ మరోసారి..! - ram charan
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాత్రకు మెగా హీరో చరణ్ మరోసారి డబ్బింగ్ చెప్పబోతున్నాడని సమాచారం.
తెలుగులో సల్మాన్ పాత్ర కోసం రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ బాలీవుడ్ హీరో కుటుంబంతో చరణ్‌కు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో మెగా హీరో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో విడుదలైన సల్మాన్ సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం కోసం డబ్బింగ్ చెప్పాడు చెర్రీ.
ప్రస్తుతం గాయం కారణంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ నుంచి విరామం తీసుకున్నాడు చరణ్. ఈ గ్యాప్‌లో 'భారత్' డబ్బింగ్ పనులు పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి.. ఎక్కడ మొదలైందో.. అక్కడే పూర్తి కానుంది