ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా మెగా ఫ్యామిలీ.. క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. కజిన్స్ అందరూ కలిసి సీక్రెట్ శాంటా ఆడారు. రామ్ చరణ్, ఉపాసన ఈ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వగా.. వేడుకల్లో అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, శిరీష్, వైష్ణవ్ తేజ్‌తో పాటు నూతన దంపతులు నిహారిక-చైతన్య కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోను అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అలానే అభిమానులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అద్భుత ఆతిథ్యమిచ్చిన చరణ్, ఉపాసనకు కృతజ్ఞతలు చెప్పారు.
క్రిస్మస్ వేడుకల్లో 'మెగా' కజిన్స్ - పంజ వైష్ణవ్ తేజ్
హీరో రామ్‌చరణ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలోని కజిన్లు అందరూ సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
క్రిస్మస్ 'మెగా' సందడి... కజిన్లంతా ఒకే చోట!