త్వరలోనే 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(ram charan movies) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(ram charan new movie) దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో బడా ప్రాజెక్ట్‌లో నటిస్తారు. అయితే ఇప్పుడా సినిమా కథ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 'జెర్సీ' తరహాలోనే ఈ మూవీ కూడా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో.. స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు చరణ్. ఒకవేళ గౌతమ్ తెరకెక్కించే సినిమా స్పోర్ట్స్ డ్రామా అయితే చెర్రీ కల నిజమైనట్లే!