తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చరణ్-గౌతమ్ సినిమా.. స్పై థ్రిల్లర్ కథతో! - ram charan shankar movie

స్టార్ హీరో రామ్​చరణ్(ram charan new movie) డిఫరెంట్​ కథతో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్'(rrr release date) పీరియాడికల్ కథ.. శంకర్​ సినిమా పొలిటికల్ బ్యాక్​డ్రాప్​తో ఉండనుంది. ఆ తర్వాత చేయబోయే సినిమా స్పై థ్రిల్లర్​ కథతో తీయనున్నట్లు తెలుస్తోంది.

ram charan gowtam tinnanuri movie
రామ్​చరణ్ మూవీ

By

Published : Oct 18, 2021, 9:25 AM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్(ram charan movies) మూవీ లైనప్​ మాములుగా లేదు. 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేసిన చరణ్.. శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభమవుతుంది. దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(ram charan new movie) దర్శకత్వంలో నటిస్తారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కథ గురించిన ఓ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రామ్​చరణ్-గౌతమ్ తిన్ననూరి మూవీ

'మళ్లీరావా', 'జెర్సీ' సినిమాలతో మెప్పించిన గౌతమ్ తిన్ననూరి.. ప్రస్తుతం హిందీలో 'జెర్సీ' రీమేక్(jersey hindi remake heroine) చేస్తున్నారు. ఇప్పుడు చరణ్​తో సినిమా ప్రకటించారు. దీనిని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. ఇందుకోసం స్పై థ్రిల్లర్​ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మూడు టైమ్​లైన్స్​లో ఈ స్టోరీ ఉండనుందని సమాచారం.

చరణ్, శంకర్​తో(ram charan shankar movie) చేయాల్సిన సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధానికి పూర్తవుతుంది. ఆ తర్వాతే గౌతమ్​ తీసే సినిమా షూటింగ్​లో పాల్గొంటారు. ఇది 2023 వేసవిలో లేదంటే ఆ తర్వాతే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది!

రామ్ చరణ్ డైరెక్టర్స్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details