కథానాయకుడు రామ్ చరణ్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. సినిమా సెట్‌లో, అక్కడి పరిసరాల్లో ఉన్న చిన్నారులతో ముచ్చట్లు పెడుతూ చాలాసార్లు కనిపించాడు. 'ధృవ', 'రంగస్థలం','వినయ విధేయ రామ' చిత్రీకరణ సమయాల్లో ఆయన చిన్నారులతో కలిసి సందడి చేశాడు. వాటి వీడియోలు, ఫొటోలు నెట్టింట బాగా చక్కర్లు కొట్టాయి.
తాజాగా చరణ్ ఓ బాబుతో కలిసి జిమ్‌లో తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ఆ బుడతడిని ఏదో ప్రశ్న అడిగి, ఆటపట్టిస్తూ కనిపించాడు. ఈ ఫన్నీ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 2లక్షల 86 వేలమందికి పైగా వీక్షించారు.
'ఆర్ఆర్ఆర్' అప్డేట్..
చెర్రీ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడు. ఇందులో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా ఆలియాభట్ నటిస్తోంది. కొమురం భీమ్‌గా నటిస్తోన్న తారక్ సరసన జెన్నిఫర్ పాత్రలో కనిపించనుందీ ఒలివియా. ఈమెతో పాటు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'ఆర్ఆర్ఆర్'లో రే స్టీవెన్సన్, ఒలివియా, అలిసన్ డూడి