మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో కుటంబ సభ్యులతో కలిసి సందడి చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలను తన ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. తాజాగా తన చెల్లి శ్రీజ కుమార్తె నవిష్కతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరలౌతోంది.
మేనకోడలితో డ్యాన్స్ చేస్తున్న రామ్‌చరణ్ - రామ్‌చరణ్ డ్యాన్స్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ లాక్‌డౌన్ సమయంలో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. తాజాగా తన సోదరి శ్లీజ కుమార్తె నవిష్కతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశాడు.
![మేనకోడలితో డ్యాన్స్ చేస్తున్న రామ్‌చరణ్ మేనకోడలితో డ్యాన్స్ చేస్తున్న రామ్‌చరణ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8291301-1015-8291301-1596539095785.jpg)
మేనకోడలితో డ్యాన్స్ చేస్తున్న రామ్‌చరణ్
ఆ మధ్య చిరంజీవి కూడా నవిష్కతో కలిసి 'ఖైదీ నెంబరు 150'లోని ఓ పాటను హమ్ చేస్తూ సందడి చేశాడు. నెట్టిజన్లలో కొంతమంది నవిష్కపై కామెంట్లు పెడుతూ తాతలాగే డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అంటూ సంబరపడుతున్నారు.
రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. జానియర్ ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో కథానాయికగా ఆలియా భట్ నటిస్తోంది.
Last Updated : Aug 4, 2020, 5:15 PM IST