తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​చరణ్ చీఫ్ గెస్ట్​గా 'హీరో', 'రౌడీబాయ్స్' సినిమా ఈవెంట్స్ - varun tej ghani thamannah

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హీరో, రౌడీబాయ్స్, గని, రామారావు ఆన్ డ్యూటీ, మై నేమ్ ఈజ్ శృతి, సూపర్​మచ్చి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

ram charan news
రాడీబాయ్స్ మూవీ రామ్​చరణ్ హీరో మూవీ

By

Published : Jan 12, 2022, 2:18 PM IST

'Hero' movie ram charan: 'హీరో' సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా హీరో రామ్​చరణ్ రానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్​ విడుదల చేసి, వెల్లడించింది. జనవరి 13న హైదరాబాద్​లో ఈ వేడుక జరగనుంది.

.

అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న 'హీరో' సినిమా.. జనవరి 15న థియేటర్లలోకి రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్​. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఎంటర్​టైనింగ్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

Prabhas Rowdy boys: డార్లింగ్ ప్రభాస్.. 'రౌడీబాయ్స్' సినిమాలోని 'హే జిందగీ' పాట రిలీజ్ చేశారు. ఫ్రెండ్​షిప్​ నేపథ్యంగా ఈ పాటను రూపొందించారు. అలానే బుధవారం సాయంత్రం నిర్వహించే ఈ సినిమా మ్యూజికల్ నైట్​ ఈవెంట్​కు మెగాపవర్​స్టార్ రామ్​చరణ్ గెస్ట్​గా రానున్నారు.

ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా కాలేజీ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కించారు. అనుపమ హీరోయిన్. శ్రీహర్ష దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మించారు. జనవరి 14న థియేటర్లలోకి రానుందీ సినిమా.

.

*హన్సిక 'మై నేమ్ ఈజ్ శృతి' టీజర్ రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్​ కథతో తీసిన ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. త్వరలో రిలీజ్ డేట్​ను వెల్లడించనున్నారు. మెగాహీరో కల్యాణ్​దేవ్ 'సూపర్​మచ్చి' ట్రైలర్ కూడా బుధవారం రిలీజైంది. లవ్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

*వరుణ్ తేజ్ 'గని' సినిమాలో స్పెషల్ సాంగ్​ అప్డేట్ వచ్చేసింది. ఇందులో తమన్నా డ్యాన్స్ చేయనున్నట్లు పోస్టర్​ రిలీజ్ చేశారు. 'కొడితే' అంటూ సాగే ఈ సాంగ్​ను జనవరి 15న ఉదయం 11:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో 'సీసా' సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం పోస్ట్ చేసింది.

'గని' సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details