తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్​' టీమ్​ హైదరాబాద్​కు.. రిలీజ్​ చెప్పిన తేదీకేనా? - Ram Charan Jr NTR

ఉక్రెయిన్ షెడ్యూల్​ పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' బృందం.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టనుంది. అయితే సినిమా రిలీజ్​ డేట్​పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత?

RRR Ukraine schedule
'ఆర్ఆర్ఆర్​'

By

Published : Aug 19, 2021, 2:17 PM IST

'ఆర్ఆర్ఆర్' టీమ్​ హైదరాబాద్​లో ల్యాండ్​ అయింది. హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్​.. ఎయిర్​పోర్ట్​లో నడుచుకుంటూ వస్తున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. అంతకు ముందు గురువారం, ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించారు. దర్శకుడు రాజమౌళి కేక్ కట్​ చేస్తున్నట్లు ఉన్న ఫొటోలు ట్రెండింగ్​లో నిలిచాయి.

రాజమౌళి

మరోవైపు 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ మరోసారి మారే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 13 కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అభిమానులు మరోసారి అసంతృప్తికి గురికావడం ఖాయం!

రామ్​చరణ్​

ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details