తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' అప్​డేట్: రొమాంటిక్ గీతంలో చరణ్-ఆలియా! - ఆర్ఆర్ఆర్ రామ్​చరణ్ ఆలియా భట్ సాంగ్

రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని రొమాంటిక్​ సాంగ్​ను చరణ్-ఆలియాలపై తీయనున్నారు. ప్రత్యేక సెట్​లో దీని షూటింగ్ జరగనుందని సమాచారం.

Ram Charan, Alia Bhatt special song for Rajamouli's RRR
'ఆర్ఆర్ఆర్' అప్​డేట్: రొమాంటిక్ గీతంలో చరణ్-ఆలియా!

By

Published : Mar 7, 2021, 12:42 PM IST

ఇప్పటివరకు యాక్షన్​ ఎపిసోడ్స్​తో బిజీగా మారిన​ 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం.. పాటల మూడ్​లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రామ్​చరణ్-ఆలియా భట్​లపై అద్భుతమైన రొమాంటిక్​ సాంగ్​ను ఈనెల 12 నుంచి తెరకెక్కించనున్నారట. హైదరాబాద్​లోని ఓ స్టూడియోలో ఇందుకోసం ప్రత్యేకంగా సెట్​ కూడా వేసినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్

దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, రే స్టీవెన్​సన్, ఆలీసన్ డూడీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ ఏడాది అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details