డార్లింగ్ ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వాటితో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం తాను నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్, చిత్రబృందంతో పాటు అభిమానులు మొక్కలు నాటాలని సవాలు విసిరారు.
ప్రభాస్ సవాలు స్వీకరించిన రామ్‌చరణ్ - RRR MIOVIE NEWS
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హీరో రామ్‌చరణ్.. మొక్కలు నాటి తన వంతు బాధ్యత నిర్వర్తించారు. తన అభిమానులు కూడా మొక్కలు నాటాలని సూచించారు.
![ప్రభాస్ సవాలు స్వీకరించిన రామ్‌చరణ్ ram charan accepted green india challenge and planted saplings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9473931-29-9473931-1604812273661.jpg)
"ఈ సీజన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా స్నేహితుడు ప్రభాస్.. నాకు మొక్కలు నాటే అవకాశాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద బతకగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ద్వారా కదిలిస్తున్న ఎంపీ సంతోష్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ చెప్పారు.
ఇవీ చదవండి: