దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం). ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. శనివారం (మార్చి 27) చెర్రీ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' నుంచి సీతారామరాజు కొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అదిరిపోయేలా ఉన్న చరణ్ లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ లుక్.. అదిరిపోయిందిగా! - ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ కొత్త లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. శనివారం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది.
!['ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ లుక్.. అదిరిపోయిందిగా! Ram Chan new look released from RRR movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11168020-977-11168020-1616754672823.jpg)
'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ లుక్
ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Last Updated : Mar 26, 2021, 4:11 PM IST