తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను హీరోయిన్​ని అన్న విషయమే గుర్తుండదు' - రకుల్ ప్రీత్ సింగ్ వార్తలు

'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్'​తో గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే తాను ఎప్పుడూ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతానని తాజాగా వెల్లడించింది.

'నేను హీరోయిన్​ని అన్న విషయమే గుర్తుండదు'
'నేను హీరోయిన్​ని అన్న విషయమే గుర్తుండదు'

By

Published : Aug 27, 2020, 7:59 AM IST

'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్'​తో గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే తాను ఎప్పుడూ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతానని తాజాగా వెల్లడించింది.

"నేను హీరోయిన్‌ని అన్న విషయమే నాకు ఎప్పుడో కానీ గుర్తురాదు. అలాంటప్పుడు స్టార్‌ హీరోయిన్‌ అని పిలిచినా ఏం లాభం చెప్పండి? సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, డాక్టర్‌ ఎలాగో నేనొక నటిని అంతే. అంతకు మించిన గుర్తింపు ఏమీ అవసరం లేదనుకుంటా. ఇక కలలంటారా.. అన్నీ కలలు నెరవేరితే మజా ఏముంటుంది? ఒకవేళ నా కలలన్నీ నెరవేరినా.. మరుసటి రోజు మరో కొత్త కల కనే రకం నేను. నేనంత ఎత్తుకు ఎదిగినా.. ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది చాలానే ఉందనుకుంటా. నా లక్ష్యాల్ని పెంచుకుంటూ పోతుంటా" అంటూ తెలిపింది రకుల్.

ABOUT THE AUTHOR

...view details