హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో తరచూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. క్యూట్, హాట్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తుంటుంది. ఈ నటికి ఫ్యాన్ పాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాలో తన ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరింది. దీనిపై స్పందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపింది రకుల్.
14 మిలియన్ ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాలో దూసుకెళ్తోన్న రకుల్ - రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టా ఫాలోవర్లు
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాలో 14 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపిందీ నటి.
రకుల్
"మాటల్లో చెప్పలేని విషయాలను ఫొటోగ్రఫీ ద్వారా చెప్పొచ్చు. నా ఇన్‌స్టా ఫ్యామిలీ 14 మిలియన్లకు చేరినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నాకు మాటలు రావట్లేదు. నేను హ్యాపీగా ఉన్నపుడు నా ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయి." అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసిందీ హీరోయిన్.
ప్రస్తుతం నితిన్ హీరోగా దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. హిందీ, తమిళ బాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.