తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోపీచంద్​తో రకుల్ మరోసారి రొమాన్స్​! - తేజ్​-గోపిచంద్​ కాంబో సినిమాలో గోపిచంద్​

కథానాయకుడు గోపీచంద్- దర్శకుడు తేజ కాంబోలో తీస్తున్న కొత్త సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్​ నటించనుందని సమాచారం.

rakul, gopichand
రకుల్​, గోపిచంద్​

By

Published : Jun 3, 2020, 9:55 PM IST

హీరో గోపీచంద్​తో ఇప్పటికే 'లౌక్యం' సినిమాలో ఆడిపాడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మరోసారి ఈ కథానాయకుడితో రొమాన్స్ చేయనుందని సమాచారం. తేజ దర్శకత్వం వహిస్తున్న 'అలివేలుమంగ వేంకరమణ' చిత్రం కోసమే రకుల్ పేరు పరిశీలిస్తున్నారట. ఈ పాత్ర కోసం ఇంతకముందు అనుష్క, కాజల్‌ అగర్వాల్‌ పేర్లు కూడా వినిపించాయి. మరి గోపీచంద్​ ఎవరితో కలిసి నటిస్తాడో చూడాలి.

తేజ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'జయం', 'నిజం' చిత్రాల్లో గోపీచంద్‌ ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం సంపత్‌ నంది కలిసి 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో దీని చిత్రీకరణ వాయిదా పడింది. కబడ్డీ నేపథ్య కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో గోపీచంద్, తమన్నా.. కబడ్డీ కోచ్​లుగా కనిపించనున్నారు.

ఇదీ చూడండి : కొవిడ్-19 రిపోర్టు బయటపెట్టిన ఆ హీరో

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details