టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్, యువ హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించనున్న చిత్రానికి.. ముహూర్తపు వేడుకను శుక్రవారం ఉదయం నిర్వహించింది చిత్రబృందం. రేపటి నుంచి చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. అంతేకాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో జోడీగా వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ - దర్శకుడు క్రిష్ కొత్త సినిమా అప్డేట్
యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుకను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
క్రిష్ దర్శకత్వంలో జోడీగా వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్
క్రిష్ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 27వ చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా దానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్స్ వర్క్స్ నిలిచిపోయాయి. పవన్ చిత్రానికి తాత్కాలిక విరామం వచ్చిన కారణంగా వైష్ణవ్ తేజ్‌తో సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోంది చిత్రబృందం.