తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రకుల్​ వాదనలను రికార్డు చేసిన ఎన్​సీబీ అధికారులు

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ వాదనలను రికార్డు చేశారు ఎన్​సీబీ అధికారులు. హీరోయిన్ దీపికా పదుకొణె, అధికారుల ముందుకు శనివారం హాజరు కానుంది.

Rakul Preet Singh's statement to NCB to be analysed and produced before court
రకుల్​ వాదనలను రికార్డు చేసిన ఎన్​సీబీ అధికారులు

By

Published : Sep 25, 2020, 7:34 PM IST

బాలీవుడ్‌ మాదక ద్రవ్యాల కేసులో విచారణలో భాగంగా, ఎన్​సీబీ అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్ వాదనలను శుక్రవారం రికార్డు చేశారు. గురువారమే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సమన్లు అందడంలో కొంత జాప్యం జరిగినట్లు సమాచారం. దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ధర్మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌లను కూడా అధికారులు విచారించారు. ఇదే కేసులో ఫ్యాషన్ డిజైనర్‌ సిమోన్‌ను ఎన్​సీబీ అధికారులు, గురవారం ఐదు గంటలు ప్రశ్నించారు. దీపికా, శనివారం విచారణకు హాజరు కానుంది.

నటి రకుల్ ప్రీత్ సింగ్

శ్రద్ధాకపూర్, సారా అలీ ఖాన్‌లను ఎన్​సీబీ విచారణకు పిలిచింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, తన సోదరుడు షోవిక్‌ ద్వారా మాదకద్రవ్యాలను సేకరించి సుశాంత్‌కు ఇచ్చేదని ఎన్​సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాల అంశంలో ఇప్పటివరకు రెండు కేసులను నమోదు చేసింది. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంలో ఓ కేసు నమోదవగా, బాలీవుడ్‌కు మాదక ద్రవ్యాలకు ఉన్న సంబంధాలపై మరో కేసు నమోదైంది. ఈ రెండింటికి దగ్గరి సంబంధాలు ఉన్నట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details