తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అడల్ట్ కామెడీ చిత్రం కోసం ఆ పాత్రలో రకుల్! - అడల్ట్ కామెడీ చిత్రంలో రకుల్

హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. తన కొత్త చిత్రంలో కండోమ్ నాణ్యత పరీక్షించే ఓ యువతిగా ఈ నటి కనిపించనుందని తెలుస్తోంది.

Rakul Preet Singh
రకుల్

By

Published : Apr 27, 2021, 5:22 PM IST

హీరోయిన్​ రకుల్​ప్రీత్ సింగ్​ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్​లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ జోరు మీద ఉంది. ఇప్పుడు మరో హిందీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా రూపొందించనున్నారు. అయితే ఇందులో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించనుందట రకుల్.

అడల్ట్ సోషల్ కామెడీ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో కండోమ్ నాణ్యతను పరీక్షించే ఓ యువతిగా రకుల్ కనిపించనుందని సమాచారం. కండోమ్​పై నెలకొన్న అనుమానాలు, భయాలను పోగొట్టడమే ముఖ్య లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. కామెడీతో నవ్విస్తూనే సామాజిక సందేశం అందించేలా ఉంటుందని తెలుస్తోంది.

త్వరలోనే 'మేడే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రకుల్​. దీంతోపాటే 'థ్యాంక్​ గాడ్'​, 'సర్దార్​ కా గ్రాండ్​సన్'​, 'డాక్టర్​ జీ' సినిమాల్లోనూ నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details