తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కండోమ్​ టెస్టర్​గా హీరోయిన్​ రకుల్​ప్రీత్​ - కండోమ్​ టెస్టర్

విభిన్న కథల్లో హీరోయిన్​గా నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న రకుల్​ప్రీత్​ సింగ్​.. ఇప్పుడు మరో బోల్డ్​ కథలో నటించేందుకు సిద్ధమైంది. దర్శకుడు తేజస్‌ డియోస్‌కర్‌ తెరకెక్కిస్తోన్న సినిమాలో రకుల్​.. కండోమ్​ టెస్టర్​ పాత్ర పోషించనుందని డైరెక్టర్​ స్వయంగా వెల్లడించాడు.

Rakul Preet Singh to play the role of condom tester in next
కండోమ్​ టెస్టర్​గా హీరోయిన్​ రకుల్​ప్రీత్​

By

Published : May 10, 2021, 2:07 PM IST

Updated : May 10, 2021, 2:25 PM IST

దక్షిణాదిలో అగ్రతారగా కొనసాగుతుండగానే బాలీవుడ్‌ బాట పట్టింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అక్కడా మంచి అవకాశాలే అందుకుంటోంది. చాలామంది నాయికల మాదిరే రకుల్‌ కొత్త దారిలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న 'డాక్టర్‌ జి'లో వైద్య విద్యార్థినిగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ బోల్డ్‌ కథలో నటించనుంది.

రకుల్​.. ఓ కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో నటించడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయం గురించి కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడా చిత్రదర్శకుడు తేజస్‌ డియోస్‌కర్‌ మాట్లాడాడు.

"మాది సామాజిక ఇతివృత్తంతో సాగే కుటుంబ కథా చిత్రం. కండోమ్‌ల ఉపయోగం ప్రధానమైన నేపథ్యంగా కథ సాగుతుంది. ఇందులోని పాత్రకు రకుల్‌ అయితేనే వందశాతం సరిపోతుందని నా నమ్మకం. ఇలాంటి సున్నితమైన, ఆలోచన రేకెత్తించే కథలోని పాత్రకు ఆమే మా తొలి ప్రాధాన్యం. ఈ కథను రకుల్‌కు వినిపించగానే అంగీకరించారు."

- తేజస్​ డియోస్​కర్​, దర్శకుడు

సాధారణంగా కండోమ్‌ కంపెనీలు 'కండోమ్‌ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌'లను నియమించుకుంటాయి. వాళ్లు తయారుచేసే కండోమ్‌లు మార్కెట్‌లోకి వెళ్లడానికి ముందే వాటి నాణ్యతను ఈ ఎగ్జిక్యూటివ్‌లు చెక్‌ చేస్తారు. వీళ్లనే 'కండోమ్‌ టెస్టర్‌లు' అని పిలుస్తారు. ఈ సినిమాకు 'ఛత్రివాలి' అనే పేరును అనుకుంటున్నారట. కొన్ని స్థానిక భాషల్లో కండోమ్‌ని ఛత్రి అని పిలుస్తారు. అందుకే ఈ పేరును పెట్టనున్నారట.

రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

ఇదీ చూడండి:మహేశ్​-త్రివిక్రమ్​ చిత్రంలో హీరోయిన్​గా నిధి?

Last Updated : May 10, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details