టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ, కథానాయకుడు రానా ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో ఆమె, రానా కలిసి వివిధ వేడుకల్లో కనిపించారు. ఫలితంగా ఆ వదంతులకు మరింత బలం చేకూరింది. తాజాగా ఈ వార్తలపై రకుల్ స్పందించింది. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్న ఆమె... తను ఎవరితోనూ డేటింగ్‌లో లేదని స్పష్టం చేసింది.
రానాతో స్నేహమే... డేటింగ్‌లో లేను: రకుల్ - రానా రకుల్ ప్రేమ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానా, Rana Rakul Dating, Rana Rakul, Rana Daggubati, Rakul Preet Singh
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో దగ్గుబాటి రానా ఒకడు. గతంలో ఈ కండల వీరుడు తమిళ నటి త్రిషాతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అగ్రనటి రకుల్ ప్రీత్ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. వాటిపై తాజాగా రకుల్ వివరణ ఇచ్చింది.
"నా ఇల్లు, రానా ఇల్లు పక్కపక్కనే. మంచు లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. అలాగే రానా కూడా క్లోజ్ ఫ్రెండ్. లక్ష్మి, నేను, రానా.. ఇలా మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో చాలా మంది ఉన్నారు. మేమంతా చాలా స్నేహంగా ఉంటాం. నా సినీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రానా నాకు తెలుసు. అయినా నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నేను సింగిల్. ఈరోజుల్లో ప్రేమకు అర్థం మారిపోయింది. నేను 70ల కాలంలో పుట్టి ఉండాల్సిందని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను".
-- రకుల్ ప్రీత్ సింగ్, సినీ నటి
రానా ప్రస్తుతం 'విరాటపర్వం' 1942 సినిమాలో నటిస్తున్నాడు. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో మర్జావాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్2, ఎస్కే 14 సినిమాల్లో బిజీగా ఉందీ అమ్మడు.