తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ విరామాన్ని 'రకుల్' ఎలా అస్వాదిస్తుందంటే?​ - Rakul shares a video her daily activities in lockdown time

లాక్​డౌన్​ వేళ ఇంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న హీరోయిన్​ రకుల్​ప్రీత్​సింగ్​... ఈ విరామ సమయంలో తాను చేస్తున్న పనులను వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.

Rakul preet singh shares a video her daily activities in lockdown time
అదే మనల్ని నిర్వచిస్తుందంటున్న రకుల్​

By

Published : Apr 27, 2020, 7:59 AM IST

"జీవన ప్రయాణంలో విరామం వచ్చినప్పుడు... ప్రతి క్షణం రొటీన్‌గా మారినప్పుడు.. ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్నదే మనల్ని నిర్వచిస్తుంది" అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరి దైనందిన జీవితం ఒకేలా మారిపోయింది. దీనికి తానూ మినహాయింపు కానప్పటికీ.. ఈ విరామాన్ని తానెంత చక్కగా వినియోగించుకుంటున్నది ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది రకుల్‌.

ఉదయాన్నే నిద్రలేచి కాఫీ తాగి, కాసేపు వ్యాయామం చేయడం, తర్వాత కాసేపు ఓ పుస్తకం చదివి, సామాజిక మాధ్యమాలకి కాస్త సమయం కేటాయించడం... మిగతా సమయంలో ఆస్కార్‌ పురస్కారాలు అందుకున్న చిత్రాలు, నచ్చిన వెబ్‌ సిరీస్‌లు చూడటం...ఇలా రోజును గడుపుతున్నట్లు ఆ వీడియో ద్వారా తెలియజేసింది రకుల్‌.

ఇదీ చూడండి : 'ఇకనైనా మన తప్పులను తెలుసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details