తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాయ్​ఫ్రెండ్​తో పెళ్లి.. రకుల్​ మాట ఇదే! - rakul preet jackky bhagnani

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్(rakul marriage updates)​. ప్రస్తుతం తాను కెరీర్​పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది.

rakul
రకుల్​ ప్రీత్​ సింగ్​

By

Published : Nov 22, 2021, 4:20 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్.. ఇటీవలే తాను రిలేషన్​​లో ఉన్నట్లు తెలిపింది(rakul preet singh husband). బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వివాహం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి(rakul marriage announcement). తాజాగా వీటిపై స్పందించింది రకుల్​.

"నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలని అనుకున్నాను. అందుకే మా రిలేషన్​ గురించి చెప్పాను. ఏ విషయంతోనూ ప్రభావితం అవ్వకూడదని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితం అందంగా ఉంది అందుకే వివరాలు పంచుకున్నాను. ఇక పెళ్లి విషయానికొస్తే అది జరిగేడప్పుడు కచ్చితంగా చెబుతాను. ప్రస్తుతం కెరీర్​ మీద దృష్టి పెట్టాను. అందుకే ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను."

-రకుల్​ ప్రీత్​ సింగ్​

కాగా, రకుల్​-జాకీ కలిసి దర్శకుడు రంజిత్​ ఎమ్​ తివారి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు(rakul preet jackky bhagnani movie). ఈ మూవీలో అక్షయ్​కుమార్​, సర్గున్​ మెహ్తా కూడా కనిపించనున్నారు.

తెలుగు సినిమా 'కెరటం'తో హీరోయిన్​గా పరిచయమైన రకుల్.. తమిళ, హిందీ భాషల్లోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'కొండపొలం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం హిందీలో డాక్టర్ జీ, ఎటాక్, మేడే, అయలాన్, థాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, ఇండియన్​ 2 సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీ కుమారుడైన జాకీ(rakul preet jackky bhagnani).. 'రెహనా హై తేరే దిల్​ మే'(2001) సినిమాలో అతిథి పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'కల్ కిస్​నే దేఖా' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. యంగిస్థాన్, వెల్​కమ్ టూ కరాచీ, ఫాల్తూ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. మరోవైపు నిర్మతగా సర్​బ్​జీత్, బెల్ బాటమ్, కూలీ నం.1, జవానీ జానేమన్ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం టైగర్​ష్రాఫ్​తో గణపత్ పార్ట్ 1, మహావీర్ కర్ణ చిత్రాల్ని రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: Rakul preet singh birthday: ఆ నటుడితో రిలేషన్​లో రకుల్​ప్రీత్

ABOUT THE AUTHOR

...view details