తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుకార్లను పట్టించుకోను: రకుల్​ప్రీత్ - సామ్ జామ్ ప్రోగ్రామ్ లో రకుల్

ఇటీవల కొంతకాలంగా తనపై వస్తోన్న పుకార్లను కొట్టిపారేసింది నటి రకుల్ ప్రీత్ సింగ్. 'ఆహా' వేదికగా ప్రసారమవుతున్న 'సామ్ జామ్' షోలో పాల్గొన్న రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Rakul Preet Singh open up about controversies
పుకార్లను పట్టించుకోను: రకుల్​ప్రీత్

By

Published : Dec 15, 2020, 1:13 PM IST

తనపై వస్తున్న పుకార్లను టాలీవుడ్‌ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కొట్టిపారేసింది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న 'సామ్‌జామ్‌' కార్యక్రమంలో ఆమె అతిథిగా పాల్గొంది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.

'కాలేజీ రోజుల్లోనే స్కూటీ రైడ్‌లకు ఛార్జీ వసూలు చేసేదానివట' అని సమంత అడగ్గా.. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్‌ అంటే నాకు చాలా ఇష్ట’మని ఆమె బాహాటంగానే చెప్పేసింది. ఆ తర్వాత ఇది ఫ్యామిలీ షో అంటూ.. సామ్‌ ఆ విషయాన్ని కట్‌ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత.. 'మీడియా, సోషల్‌మీడియాలో మీపై వస్తున్న వార్తలపై ఎందుకు స్పందిచరు..?' అని సమంత అడిగిన ప్రశ్నకు రకుల్‌ స్పందించింది.

"మనపై పుకార్లు పుట్టించేవారు ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించరు. నేను ఉంటున్న ఇల్లు కూడా ఎవరో ఒక వ్యక్తి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారు. ఎవరో నాకు ఇల్లు ఇస్తే.. మరి నేను పని చేయడం దేనికి..? ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. అందుకే పుకార్లను నేను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. మని పని మాత్రమే మాట్లాడుతుంది" అని రకుల్ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details