తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెబ్​సిరీస్​లో రకుల్ ప్రీత్.. త్వరలో ఎంట్రీ! - రకుల్ రానా రిలేషన్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. త్వరలో ఓ వెబ్​ సిరీస్​లో నటించే అవకాశముంది. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విశేషాలను పంచుకుంది.

వెబ్​సిరీస్​లో రకుల్ ప్రీత్.. త్వరలో ఎంట్రీ
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

By

Published : Dec 26, 2019, 9:23 AM IST

అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు వెబ్​సిరీస్​లతో అలరించేందుకు పలువురు స్టార్స్ సిద్ధమవుతున్నారు. అగ్ర తారలైన కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. ఇందులోకి త్వరలో మరో ముద్దుగుమ్మ చేరనుంది. ఆమె రకుల్ ప్రీత్ సింగ్. తనకు డిజిటల్ వరల్డ్​లో నటించాలనుందని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

"వెబ్​ సిరీస్​ల్లో నటించాలని చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఏదైనా కొత్త కథ అనిపించినప్పుడే నేను ఒప్పుకుంటా. సినిమాల్లో చేయలేని పాత్రలు కొన్ని అందులో చేయొచ్చు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. కానీ డిజిటల్ ప్రపంచంలో నటన ఫరిదిని విస్తరించొచ్చు. సరికొత్త పాత్రల్లో కనిపించే అవకాశముంది" -రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్

ప్రస్తుతం ఈ భామ.. కమల్​హాసన్​ 'భారతీయుడు 2'లో.. నితిన్ సరసన ఓ సినిమాలో, బాలీవుడ్​లో జాన్ అబ్రహం పక్కన 'ఎటాక్​'లో కథానాయికగా నటిస్తోంది.

ఇది చదవండి: తొలి సినిమా అందుకోసమే చేశా: రకుల్ ప్రీత్

ABOUT THE AUTHOR

...view details