టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఏదైనా ప్రణాళిక ప్రకారం చేస్తుందట. అందుకే తర్వాత జరిగే పరిణామాలు పట్టించుకోనని అంటోంది. గోవాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (2019) కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపింది రకుల్.
"ఏ పనినైనా కచ్చితమైన ప్రణాళికలు వేసుకొనే మొదలుపెడతాను. కానీ అవి నేను అనుకున్నట్లు జరగవు. మొదట సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎలా నటిస్తున్నా అనే విషయాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ సినిమా తెరపైకి వచ్చినప్పుడు దాని ఫలితం అర్థమవుతుంది."
-రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ హీరోయిన్.
చిన్న చిన్న విషయాలకు బాధపడనని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. తను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని, అందుకే ధైర్యం ఎక్కువని చెప్పింది రకుల్.
"ప్రతి చిన్న విషయానికి బాధపడను. నేను అనుకున్న వృత్తిలో ఆనందంగా రాణిస్తున్నామా లేదా అనేది మాత్రమే చూస్తాను. కొందరికి నా చిత్రాలు నచ్చకపోవచ్చు. అది వాళ్ల అభిప్రాయం. దానికి నేనెందుకు బాధపడతాను. నా పనేదో చేసుకుంటూ ముందుకుపోవడమే తప్ప వెనుదిగిరి చూడను. నేను చిన్నతనం నుంచే చాలా ప్రాంతాల్లో పెరిగాను. ఎందుకంటే మాది ఆర్మీకి చెందిన కుటుంబం. అందుకే నాలో ధైర్యం కూడా ఎక్కువే. అందుకే ఎక్కడా ఇబ్బంది పడినా సందర్భాలు లేవు. ఎంత సంపాదించినా మామూలు మనుషుల మధ్య గడపడమే నాకు ఇష్టం."
-రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ హీరోయిన్.
ఈ ఏడాది మన్మథుడు-2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
ఇదీ చదవండి; 'ఆర్ఆర్ఆర్' నుంచి ఆలియా ఔట్.. హాలీవుడ్ నటితో చిత్రీకరణ!