తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సీమ ఓబులమ్మ'గా రకుల్​ప్రీత్​ సింగ్​! - క్రిష్‌ ఇంటర్వ్యూ

ఎప్పుడూ గ్లామర్​ రోల్సే కాదు. విభిన్నమైన పాత్రలు పోషించడానికీ సిద్ధంగా ఉంటానని అంటోంది హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​. తన కొత్త సినిమాలో డీగ్లామర్​ పాత్రలో నటించినట్లు తెలిపింది.

Rakul preet singh acted as de glamour role in her new movie
సీమ ఓబులమ్మగా రకుల్​ ప్రీత్​ సింగ్​!

By

Published : Dec 19, 2020, 8:18 AM IST

'ఓ నటిగా విభిన్నమైన పాత్రలు పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ గ్లామర్‌ పాత్రలతోనే ప్రయాణం చేస్తే మనకు తెలియకుండానే మనపై ఓ ఇమేజ్‌ పడిపోతుంద'ని చెబుతోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అందం.. అదృష్టం.. ప్రతిభ.. సమపాళ్లలో కలిగి ఉన్న ముద్దుగుమ్మ ఆమె. అందుకే తెరపై అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటినా.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

రకుల్​ ప్రీత్​ సింగ్​

ప్రస్తుతం ఆమె క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందుతోంది. ఇప్పుడీ చిత్రం కోసం తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో నటించినట్లు తెలియజేసింది రకుల్‌. సమంత హోస్ట్‌ చేస్తున్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చింది. తాను డీగ్లామర్‌ పాత్రలో కనిపించడమే కాకుండా.. తొలిసారి రాయలసీమ యాసలో సంభాషణలు పలికినట్లు తెలియజేసింది. ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న క్రిష్‌.. రకుల్‌ పాత్ర పేరును బయటపెట్టారు. ఆమె ఈ చిత్రంలో ఓబులమ్మ అనే పాత్రలో దర్శనమివ్వనుందని తెలియజేశారు.

ఇదీ చూడండి:పుకార్లను పట్టించుకోను: రకుల్​ప్రీత్

ABOUT THE AUTHOR

...view details